నయనతార, విఘ్నేష్ శివన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారంతే. వచ్చే నెలలో పెళ్లికి సిద్ధమౌతున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో సింపుల్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇంతలోనే ఓ జ్యోతిష్కుడు, నయనతార పెళ్లిపై నీళ్లుచల్లాడు. ఆమె పెళ్లి చేసుకుంటే విడాకులు గ్యారెంటీ అంటున్నాడు. అతడి పేరు వేణు స్వామి.
జాతకాలు చెప్పే వేణు స్వామి, ఎక్కువగా సెలబ్రిటీల జాతకాలపై దృష్టి పెడతారు. దీనికి సంబంధించి ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలు కూడా యూట్యూబ్ లో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడీ స్వామి నయనతార పెళ్లిపై జ్యోతిష్యం చెప్పారు. జాతకరీత్యా నయనతార పెళ్లి చేసుకుంటే ఆ వివాహం నిలబడదని అంటున్నారు వేణు స్వామి. పెళ్లయిన కొన్నాళ్లకే విఘ్నేష్ తో విడాకులు తప్పవంటున్నారు.
తన జ్యోతిష్యానికి సాక్ష్యాలు కూడా చూపిస్తున్నాడీయన. గతంలో సమంత-నాగచైతన్య పెళ్లి చేసుకోవద్దని చెప్పింది ఈయనే. ఆ పెళ్లి నిలబడదని కూడా చెప్పారు. నిజంగానే సమంత-నాగచైతన్య విడిపోయారు. కాబట్టి ఇప్పుడు నయనతారపై కూడా ఈయన చెప్పిన జోష్యం నిజమౌతుందేమో అని చాలా మంది భయపడుతున్నారు.
కేవలం సమంత, నయనతార మాత్రమే కాదు.. అనుష్క-ప్రభాస్ పై కూడా ఈయన గతంలో జోస్యం చెప్పాడు. వాళ్లకు వివాహ యోగం లేదన్నాడు. పెళ్లి చేసుకున్నా నిలబడదన్నాడు.