ఖగోళం అద్భుతాల పుట్టిల్లు. అక్కడ ఏం జరిగినా మనకు వింతే. అందుకే ఏ చిన్న విషయాన్నయినా ఆసక్తికరంగా గమనిస్తుంటాం. అందుకు తగ్గట్టే అక్కడ జరిగే వింతలు, విశేషాలను ఎప్పటికప్పుడు నాసా అందిస్తుంటుంది. తాజాగా ఖగోళంలో ఓ అద్భుతం అవిష్కృతమైంది.
నక్షత్రంతో కూడిన బ్లాక్‌హోల్ చుట్టూ 8 X- కిరణాలలో అసాధారణమైన వలయాల సమితిని గుర్తించారు. కాంతి ప్రతిధ్వనుల ద్వారా సృష్టించబడినవిగా భావిస్తున్న ఈ వలయాలు.. గెలాక్సీలో ఉన్న దుమ్ము గురించి సమాచారాన్ని వెల్లడిస్తాయి. ఈ బ్లాక్ హోల్ భూమికి దాదాపు 7,800 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న V404 సైగ్ని అనే బైనరీ వ్యవస్థలో భాగం.