నరసాపురం ఎంపీ రఘురామపై కేసు నమోదైంది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయన పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో రఘురామ కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను నిందితులుగా చేర్చారు. విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్‌హిల్స్ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు వచ్చి తనను కారులో ఎక్కించుకొని రఘురామ ఇంట్లోకి తీసుకెళ్లి, చిత్రహింసలకు గురి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్‌కే ఫరూక్ భాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన వద్ద పర్సు, ఐడీ కార్డు లాగేసుకున్నారన్నారు. ప్రధాని భద్రతా విధుల్లో ఉండగా తనపై దాడి చేశారన్నారు. ఎంపీ రఘురామ ఇంట్లో తనను 3 గంటలు పాటు నిర్బంధించారని, రఘురామ సహా ఐదుగురు తనపై దాడి చేశారని పేర్కొన్నారు. తనను కారులో బలవంతంగా తీసుకెళ్లారన్నారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను అని చెప్పినా వినలేదు. ఎంపీ, మరో ముగ్గురు లాఠీలతో కొట్టి దుర్భాషలాడారని కానిస్టేబుల్ పేర్కొన్నాడు.
తాజాగా ఎంపీ, ఎంపీ కుమారుడు భరత్, పీఏ శాస్త్రీ సహా మరో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై 365,332,384,323,324,342,504,506,294(b) r/w 34,109 IPC సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
A1గా ఎంపీ రఘురామ కృష్ణం రాజు, A2గా భరత్ S/o రఘురామ కృష్ణంరాజు, A3 గా సందీప్, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్, A4 గా ASI సీఆర్పీఎఫ్, A5 గా శాస్త్రీ, రఘురామ పీఏలను ఎఫ్ఐఆర్ లో చేర్చినట్లు తెలుస్తోంది.