డెస్టినీ ఎవరిని ఎటు నడిపిస్తుందో తెలియదు. ఓ స్టైలిష్ కండక్టర్ని దిగ్దదర్శకుడి దృష్టిలో పడేలా చేసింది. శివాజీ గైక్వాడ్ అనే ఓ మధ్యతరగతి మనిషిని రజనీకాంత్ ని చేసింది. కన్నడ దేశానికి చెందిన వ్యక్తిని తమిళ సూపర్ స్టార్ని చేసింది.
ఇక సినిమా విషయాలకు వస్తే రజనీ నటించిన సినిమాల్లో వేటికవే అద్భుతాలు చేసినా, బాషా సినిమా మాత్రం రజనీ కెరీర్లో ఓ మైల్ స్టోన్ . కథ విషయానికి వస్తే హీరో ఒక సాధారణ ఆటోడ్రైవర్‌గా కాలం గడుపుతుంటాడు.
ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఆ ఆటో డ్రైవర్ ఒక డాన్ అని తెలుస్తుంది. దీంతో అప్పటి వరూ స్మూత్ గా సాగుతున్న సినిమా దౌడు తీస్తుంది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడానికే అన్నట్టుగా సినిమా నడక,నడత మారుతుంది.
డాన్ అయిన వ్యక్తి ఆటో డ్రైవర్‌గా ఎందుకు జీవిస్తున్నాడు…అనేది ఆసక్తిని రేపే కథనం. అప్పట్లో ఈ మూవీ సౌత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు, రికార్డులను కొల్లగొట్టింది. తరువాత దీన్ని తెలుగులో డబ్ చేశారు.
అయితే ఈ మూవీకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ముందుగా తమిళంలోనే తీసినా తెలుగులో మాత్రం ఆయన ఈ మూవీని రీమేక్ చేయాలని అనుకున్నారట. అందుకనే బాషా నిర్మాతలు హైదరాబాద్ లో మన హీరోల కోసం ఓ స్పెషల్ షో వేశారట.
ఇక దర్శకుడు సురేష్ కృష్ణ ఈ మూవీని చిరంజీవి లేదా బాలకృష్ణతో రీమేక్ చేయాలని అనుకున్నారట. బాలకృష్ణ అయితే ఈ క్యారెక్టర్‌కు సరిగ్గా సూటవుతారని అనుకున్నారట. దీంతో ఆయనను అనేక సార్లు సురేష్ కృష్ణ అడిగారట.
అయితే బాలయ్యకు రీమేక్స్ అంటే నచ్చవు. ఒరిజినల్ కథతోనే ఆయన సినిమాలు తీస్తారు. కనుక బాషా రీమేక్‌కు ఆయన ఒప్పుకోలేదు. దీంతో చేసేదిలేక రజనీ సినిమానే తెలుగులోకి యథావిధిగా డబ్బింగ్ చేశారు.
అయినప్పటికీ తెలుగులోనూ ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే అప్పట్లో బాలకృష్ణ బాషా సినిమాను గనక చేసి ఉంటే విషయం వేరేగా ఉండేది. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయి ఉండేదని చెప్పవచ్చు.
అయితే బాలయ్య కెరీర్ని మలుపుతిప్పిన సమరసింహారెడ్డి సినిమా బాషా సినిమా ఫార్మాట్ లోనే ఉంటుంది. కాకపోతే సమరసింహారెడ్డి ఫ్యాక్షన్ బ్యాగ్రాప్, బాషా మాఫియా బ్యాగ్రాప్. రెండిటి ఫార్ములా మాత్రం ఒకటే.
Also Read: భళ్లాల దేవుడి ముఖంపైనున్న గీతకథ…!