ఐఐటీ మద్రాస్ ను కరోనా వణికిస్తోంది. తాజాగా ఐఐటీలో మరో 32 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు 111 మంది కరోనా బారినపడినట్టు అధికారులు తెలిపారు.
క్యాంపస్ లో కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే విద్యార్థులందరూ కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో తీసుకున్నారని చెప్పారు.
ఇప్పటికే ఐఐటీ మద్రాస్ మూడు వేవ్ లను చూసిందని, గతంలో నేర్చుకున్న పాఠాలతో ఇప్పుడు కరోనాను కట్టడి చేయగలమని అధికారులు చెబుతున్నారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో క్యాంపస్ ను ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ జే. రాధాక్రిష్ణన్, చెన్నై జోనల్ మెడికల్ అధికారిత పాటు ఇతర అధికారులు క్యాంపస్ ను పరిశీలించారు.
కేసులు పెరుగుతున్న దృష్య్టా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలన్నారు. విద్యార్థుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐఐటీ సిబ్బంది దృష్టి తీసుకురావాలని సూచించారు.