ఆప్ఘనిస్తాన్ లో బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లోని మజర్-ఈ-షరీఫ్ లోని షియా మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మందికి పైగా మరణించినట్టు అధికారులు తెలిపారు.
దీంతో పాటు మరు మూడు చోట్ల వరుస బాంబు పేలుడు ఘటనలు చోటు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. నంగర్ హార్, కాబూల్, కుందుజ్ ప్రాంతాల్లో ఈ పేలుళ్లు సంభవించినట్టు అధికారులు పేర్కొన్నారు.
మజీర్-ఈ-షరీఫ్ లోని తాలిబాన్ ప్రతినిధి మాట్లాడుతూ… ‘ మజీర్ ఈ షరీఫ్ మసీదుకు వెలుపల భారీ పేలుడు సంభవించించింది. దీంతో 18 మంది మరణించారు. మరో 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయి’ అని చెప్పారు.
పాకిస్తాన్ సరిహద్దులోని నంగర్ హార్ లో జరిగిన పేలుళ్లలో నలుగురు సైనికులు మరణించినట్టు సమాచారం. ఆప్ఘనిస్తాన్ లో ఈ నెలలో కొన్ని రోజులుగా బాంబు పేలుళ్లు సంభవిస్తున్నాయి. కాబూల్ పేలుళ్లలో మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది.