రష్యాలో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. పెర్మ్ స్టేట్ యూనివర్సిటీలోకి చొరబడిన దుండగుడు విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 8మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
స్టూడెంట్స్ పారిపోవాల్సిందిగా యూనివర్సిటీ సిబ్బంది చెప్పడంతో అందరూ పరుగులు పెట్టారు. భవనం పైనుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. విద్యార్థులు పైనుంచి దూకుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.