ఇండస్ట్రీలో చాలా మంది విలన్ లు ఉన్నారు. అయితే ఒకానొక సమయంలో మాత్రం విలన్లకు కేరాఫ్ అడ్రస్ రాజనాల. ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలో విలన్ పాత్ర అంటే ప్రతి ఒక్కరికి రాజనాల పేరు గుర్తుకు వచ్చేది. ఆయన నటించిన పాత్రలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. విలన్ పాత్ర లోనే కాదు చాలా పాత్రల్లో నటించారు రాజనాల. కానీ ప్రేక్షకులకు మాత్రం విలన్ గానే కనెక్ట్ అయ్యారు.
నందమూరి తారక రామారావు రాజనాల మధ్య కూడా మంచి సంబంధాలు ఉండేవి. ఇద్దరూ కలిసి వద్దంటే డబ్బు అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో తారక రామారావు మామ పాత్రలో రాజనాల నటించారు. అయితే షూటింగ్ సమయంలో మామాజీ అని పిలవడం మొదలు పెట్టిన ఎన్టీఆర్, షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా ఆ పిలుపు ఆపలేదట.
దీంతో వీరిద్దరి బంధం అప్పట్నుంచి కంటిన్యూ అయింది. ఎన్టీఆర్ నటించిన జై సింహ సినిమాలో కూడా విలన్ పాత్ర పోషించాడు. ఆ తర్వాత రాజనాలకు వరుసగా అవకాశాలు వచ్చాయి. హిందీ, కన్నడ భాషల్లో కూడా నటించారు. హాలీవుడ్లో కూడా నటించారు రాజనాల.
సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెట్టటం వెనుక పెద్ద స్టోరీనే ఉందిగా!!
అయితే ఎంతో సాఫీగా సాగుతున్న సమయంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. 32 ఏళ్ళకే రాజనాల భార్య కన్ను మూసింది. అప్పటికే ఆయనకు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఆమెతోనే అదృష్టం కలిసి వచ్చిందన్న రాజనాల ఆమె పోయాక ఎంతో కుంగిపోయారు. అయితే భార్య చనిపోయాక పరామర్శించేందుకు వెళ్లిన ఎన్టీఆర్ నీ లక్ష్మి వెళ్ళిపోయింది మామ అంటూ కన్నీరు పెట్టుకున్నాడట.
ఆడపిల్లలకు పెద్ద మనిషి ఫంక్షన్ ఎందుకు చేస్తారు…?
దీంతో సంవత్సరన్నర కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న రాజనాల ఆ తర్వాత పిల్లల కోసం భూదేవిని రెండో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత అవకాశాలు కూడా తగ్గిపోయాయి. చివరగా తెలుగువీర లేవరా అనే సినిమాలో నటించారు. చివరికి అనారోగ్యంతో మృతి చెందాడు. ఇక అప్పట్లో ఆయన హాస్పిటల్ బిల్లు లక్ష ఏనబై వేలు రాగ అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున ఆ బిల్లును కట్టారు.