స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫోటో అనేది చాలా మందికి ఒక పిచ్చి అయిపోయింది అనే మాట వాస్తవం. ఫోటో విషయంలో చూపించే శ్రద్ధ వేరే ఏ విషయాల మీద ఉండదు. సేల్ఫీ అని, వీడియో అని ఏదొకటి అంటూ సందడి చేస్తూ ఉంటారు. ఇక ఫోటో ఏ టైం లో తీస్తే మంచిది ఏంటీ అనే విషయం చాలా మందికి తెలియదు.
ఫోటో ఏ టైం లో తీయాలో ఒక్కసారి చూద్దామా…? పోర్ట్రెయిట్ ఫోటోలు ఈ మధ్య కాస్త ట్రెండ్ లా కనపడుతుంది. ఈ ఫోటోలు తీయడానికి మంచి టైం సూర్యోదయం తర్వాత రెండు గంటలు మరియు సూర్యాస్తమయానికి రెండు గంటల ముందు తీస్తే బాగా వస్తాయి. మార్నింగ్ గోల్డెన్ అవర్ తర్వాత లేదా సాయంత్రం గోల్డెన్ అవర్ ముందు తీయడం మంచిది అని చెప్తున్నారు.
గోల్డెన్ అవర్ అంటే అర్ధం ఏంటీ అంటే సూర్యుడు ఆకాశంలో తక్కువగా ఉనే టైం. ఇది రోజుకు రెండుసార్లు మాత్రమే జరుగుతుంది. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం వద్ద మాత్రమే. మీ ఉండే ప్లేస్ టైం ని బట్టి ఇది గంట సేపు వరకు ఉంటుంది. ఆకాశంలో సూర్యుడు తక్కువగా ఉండటంతో పడే నీడ మృదువుగా ఉంటుంది. ఆ టైం లో ఫోటో తీయడంతో మన ముఖం కూడా స్పష్టంగా ఉంటుంది, కెమెరా క్వాలిటీ కూడా పెరుగుతుంది.