అటల్ టన్నెల్(సొరంగం) అరుదైన రికార్డు సాధించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే టన్నెల్ గా వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి అధికారిక దృవీకరణ పత్రాన్ని బీఆర్ వో డీజీ లెఫ్ట్ నెంట్ జనరల్ రాజీవ్ చౌదరీకి అందినట్టు వెల్లడించింది.
ప్రపంచంలో అత్యంత పొడవైన అటల్ టన్నెల్ 10000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ టన్నెల్ హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిని లడఖ్ లోని లేహ్ తో కలుపుతుంది. ఈ టన్నెల్ ను నిర్మించడం వల్ల మనాలి, లేహ్ ల మధ్య 46 కిలోమీటర్ల దూరం తగ్గింది. దీని వల్ల 4 నుంచి 5 గంటల ప్రయాణ కాలం తగ్గంది.
ఈ సొరంగ మార్గాన్ని పీర్ పంజల్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో ఆధునిక సంకేతికతను ఉపయోగించి నిర్మించారు. ఇందులో రక్షణకు ప్రధాన్యత ఇచ్చారు. ఇక వ్యూహాకాత్మకంగా చూస్తే ఇది అత్యంత ప్రాధాన్యత గల సొరంగ మార్గం. ఇది 10.5 మీటర్ల వెడల్లు, 5.52 మీటర్ల ఎత్తు ఉంటుంది.
దీన్ని 3 అక్టోబర్ 2020న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో ప్రధాన సొరంగ మార్గంలో ఏదైనా ప్రమాదం జరిగితే రక్షణ చర్యల కోసం మరో సొరంగ మార్గాన్ని నిర్మించారు. ప్రపంచంలో ఇలాంటి రెస్క్యూ టన్నెల్ ఏదేశంలోనూ లేకపోవడం గమనార్హం.