ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ నిర్ణయంలో మార్పు లేకపోవటంతో… మరో ఆర్టీసీ డ్రైవర్ మనస్థాపంతో 200కె.వి విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. అచ్చంపేట డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న హరిశ్చంద్ర సెప్టెంబర్ నెల జీతం రాకపోవడం, ఓవైపు ప్రభుత్వం సెల్ఫ్ డిస్మిస్ అని ప్రకటించటంతో… మనస్థాపంతో ఉన్నట్లు కుటుంభ సభ్యులు తెలిపారు. గత కొద్ది రోజులుగా జరగుతోన్న కార్మికుల ధర్నాలో ముందుండి పాల్గొంటున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. తన దగ్గరకి ఎవరైనా వస్తే 200 కె వి వైర్ ని పెట్టుకుంటా అని బెదిరించటంతో రంగం లోకి పోలీస్ దిగి కిందకి దించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కుటుంభ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.