అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రజలు వినాయకచవితి జరుపుకోవడం జగన్ కు ఇష్టం లేదా..? విగ్రహాల ఏర్పాటుపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాక కూడా అడ్డుకోవడానికి పోలీసులు ఎవరు..? భక్తుల మనోభావాలతో జగన్ చెలగాటమాడుతున్నారు. విజయవాడ కానూరులోని ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను తొలగించడం సరికాదు.
ఇప్పటివరకు తొలగించిన విగ్రహాలను తిరిగి ప్రతిష్టాపన చేసి భక్తులకు సీఎం క్షమాపణలు చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకొంటుంటే ప్రభుత్వం వేధింపులకు తెరలేపింది.
పోలీసులు మంటపాల్లోకి వెళ్లి విగ్రహాలు తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం ఏంటి..? జగన్ చెత్తశుద్ధిని పక్కనబెట్టి చిత్తశుద్ధితో పరిపాలన చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది.