కర్ణాటకలోని ఓ ఏటీఎంలో వంద రూపాయలకు బదులు అన్ని 500 రూపాయలే వస్తున్నాయి.కొడుగు జిల్లా కేంద్రంలో మడికేరీలోని ఓ ఏటీఎం లో రూ.100 డ్రా చేయాలనుకున్నా రూ 500 వందల నోటు వస్తుంది. దీంతో కొందరు చడీ చప్పుడు వచ్చిన డబ్బులను తీసుకొని వెళ్లారు. చివరకు కొందరు ఈ విషయాన్ని బ్యాంక్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు వచ్చి తనిఖీ చేయగా అది ఏటీఎంలో నగదు నింపే సంస్థ పొరపాటుగా గుర్తించారు. వంద రూపాయలు ఉంచే ట్రేలో 5 వందల రూపాయల బండిల్స్ ఉంచడంతో ఈ సమస్య ఏర్పడింది. అప్పటికే లక్షా 70 వేల రూపాయలను డ్రా చేసుకొని వెళ్లారు. అలా డ్రా చేసుకున్న వారిలో కొందరిని గుర్తించి ఫోన్ చేయగా ఒకరిద్దరు తిరిగిచ్చారు. మిగతా వారు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో బ్యాంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఫోన్లు చేసి ఆ డబ్బును రికవరీ చేశారు.