పార్క్‌లోకి వస్తున్న ఓ వాహనానికి పర్మిషన్ తీసుకోవాలని చెప్పిన పాపానికి కౌన్సిలర్ అని కూడా చూడకుండా దాడికి యత్నించారు కొందరు పెద్ద మనుషులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్కాపూర్ 8 వ వార్డు కౌన్సిలర్ నవీన్ కుమార్ పార్క్‌లోకి వస్తున్న మిలెట్ వాహనానికి పర్మిషన్ తీసుకోవాలని వాహన యజమానికి తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న మణికొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, బీజేపీ నాయకుడు అంజనీ కుమార్ నవీన్ కుమార్ ని బండ బూతులు తిడుతూ దాడికి యత్నించారు. వాహనాన్ని అడ్డుకోవడానికి నువ్వు ఎవడివిరా అంటూ అందరి ముందు దుర్భాషలాడారు.
ఈ ఘటన గురించి నవీన్ నార్సింగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.