కృష్ణా జిల్లా గడ్డమణుగ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి దేవినేని ఉమ కారుపై దాడి జరిగింది. కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ ను పరిశీలించి తిరిగి వస్తుండగా ఈ దాడి చేశారు. గడ్డమణుగ దగ్గర అడ్డగించిన వ్యక్తులు.. కారుపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే స్పాట్ కు చేరుకున్నారు టీడీపీ కార్యకర్తలు. దీంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.
తనపై దాడి చేయించింది ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అని ఆరోపించారు దేవినేని ఉమ. ఆయన అనుచరులే రాళ్లు రువ్వారని అన్నారు. పోలీసులు కూడా దాడి చేసిన వారికి వంత పాడారని.. జి.కొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు ఉమ. దాడి విషయం తెలిసి చంద్రబాబు.. దేవినేనికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.