బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత ప్రజాస్వామ్య ప్రక్రియలను దెబ్బతీసే ప్రకటనగా దీన్ని ఆమె వర్ణించారు. సోరోస్ వ్యాఖ్యలు భారత్ పై దాడి చేసినట్టుగా ఆమె పేర్కొన్నారు.

భారత్ పట్ల దురుద్దేశాన్ని వ్యక్తం చేసిన జార్జ్ సోరోస్‌ను డిజైన్ చేయబడిన ఆర్థిక యుద్ధ నేరస్తుడని ఆమె ఫైర్ అయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను బద్దలు కొట్టి, ఆర్థిక యుద్ధ నేరస్థుడిగా పేర్కొనబడిన వ్యక్తి ఇప్పుడు భారత ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలనే కోరికను ప్రకటించాడని ఆమె ఆరోపించారు.
అలాంటి శక్తులు ఇప్పుడు విదేశాల్లోని ప్రభుత్వాలను పడగొట్టి, వారి అనుకూల వ్యక్తులను అధికారంలో కూర్చోబెట్టే ప్రయత్నాలు చేస్తాయని ఆమె మండిపడ్డారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఇటీవల స్టాక్ మార్కెట్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు బారత్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణను ప్రోత్సహిస్తాయంటూ సోరోస్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.