పాకిస్తాన్ కు చెందిన ఓ టిక్ టాకర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 300 నుంచి 400 మంది చుట్టుముట్టి ఆమెపై దాడికి పాల్పడ్డారు. గాల్లోకి ఎగరేస్తూ.. బట్టలు చింపేందుకు చూశారు.
లాహోర్ లోని మినార్ ఇ పాస్తాన్ దగ్గర ఈనెల 14న జెండా వందనం కార్యక్రమం జరుగుతుండగా.. ఓ యువతి టాక్ టాక్ వీడియో చేద్దామని అనుకుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి వీడియో తీయబోయింది. అయితే అక్కడే ఉన్న ప్రజలు.. ఆమె ఫోన్ లాక్కొని దాడికి పాల్పడ్డారు. డబ్బులు, ఆభరణాలు దోచుకున్నారు. సెక్యూరిటీ గార్డు సాయంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. సీసీటీవీ ఫుటేజ్, వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.