తన భూమిని కబ్జా చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సినీ రచయిత చిన్ని కృష్ణ. హైదరాబాద్ శివార్లలో ఉన్న శంకర్ పల్లి గ్రామ పంచాయతీలో నా స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఫిర్యాదు లో ఆయన పేర్కొన్నారు.
ఇదే ఇష్యూ పై హైకోర్టులో పిటిషన్ వేసినందుకు తనపై దాడికి యత్నించారని తెలిపారు. దాడికి యత్నించిన వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చిన్ని కృష్ణ.
చిన్ని కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఇష్యూ కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.