రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందన్న విషయాన్ని ఉక్రెయిన్ అధికారి ఒకరు తాజాగా ధ్రువీకరించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలోనే పుతిన్‌పైన దాడికి ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. అయితే, ఆ దాడి నుంచి పుతిన్ విజయవంతంగా బయటపడినట్లు ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కిరిలో బుడనోవ్ తెలిపారు.
హత్యాయత్నం జరిగిన ప్రదేశాన్ని కూడా ఉక్రెయిన్ అధికారి తెలపడం గమనార్హం. అయితే, అదృష్టవశాత్తు ఆ దాడి నుంచి పుతిన్ తృటిలో తప్పించుకున్నాడని పేర్కొన్నారు. నల్ల సముద్రం, కేస్పియన్ సముద్రం మధ్య ఉండే కౌకసస్ ఏరియాలో పుతిన్ పై దాడి జరిగిందని చెప్పారు.
రష్యా అధ్యక్షుడిపై హత్యాయత్నం గురించి ఉక్రెయిన్ అధికారి తెలుపుతున్న క్రమంలోనే పుతిన్ అనారోగ్యం పాలైనట్లు వార్తలొస్తున్నాయి. పుతిన్ బ్లడ్ కేన్సర్‌తో ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ విషయమై సర్జరీ చేసుకున్నారని వార్తలొచ్చాయి.
పుతిన్ అనారోగ్య విషయమై రష్యాకు చెందిన ఓ వ్యక్తి స్పందించారు. పుతిన్ అనారోగ్యం పాలయిన విషయం నిజమేనని తెలిపారు. హత్యాయత్నానికి సంబంధించి గతంలో పుతిన్ ఓ ప్రకటన చేశారు. తనపై ఐదు సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయని, అయినా తన భద్రత గురించి తాను ఎప్పుడూ ఆందోళన చెందలేని పుతిన్ పేర్కొన్నారు. కొంత కాలంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.