ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ పై దాడి జరిగింది. ముంబైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోను నిగమ్ బృందంపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నిగమ్ తో పాటు అతని స్నేహితునికి, బాడీగార్డుకు గాయాలయ్యాయి. దీనితో వారిని జైన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముంబైలోని చెంబూరులో సంగీత కచేరీకి నిగమ్ తన బృందంతో కలిసి వచ్చారు. ఈ సమయంలో కొందరు అభిమానులు బృందంతో కలిసి సెల్ఫీలు దిగడానికి యత్నించారు. మెట్లు దిగి వస్తున్న ఆయన వద్దకు వెళ్లగా తోపులాట జరిగింది. అయితే సెల్ఫీలు తీసుకోడానికి సెక్యూరిటీ నిరాకరించడంతో అక్కడే ఉన్న సోను నిగమ్ స్నేహితుడు రబ్బానీ ఖాన్ ను కింద పడేశారు.
ఈ తోపులాటలోనే దాడి కూడా జరిగినట్లు తెలుస్తుంది. అయితే నిగమ్ ను అతని స్నేహితుడిని సెక్యూరిటీ రక్షించారు. వారిని దూషిస్తునే ఈ దాడి చేసినట్లు తెలుస్తుంది.
కాగా ప్రముఖ సింగర్ పై దాడి ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్ చెంబూర్ ఉత్సవంల సోనూ నిగమ్ ను కలిసేందుకు ప్రయత్నించాడు. అతనితో సెల్ఫీలు తీసుకోవాలని కొంతమంది చెట్లు ఎక్కారు. గాయకుడిని కలవడానికి వారిని పర్మిషన్ ఇవ్వలేదు.
దీంతో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అతని సహచరుడు రబ్బానీ ఖాన్ కిందపడేశారు. ఈక్రమంలోనే ఎమ్మెల్యే కుమారుడు, అతని సెక్యూరిటీ సోనూనిగమ్ తోపాటు అతని స్నేహితుడిని దూషిస్తూ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
#SonuNigam attacked by Uddhav Thackeray MLA Prakash Phaterpekar son and his goons in music event at Chembur. Sonu has been taken to the hospital nearby. pic.twitter.com/ERjIC96Ytv
— Swathi Bellam (@BellamSwathi) February 20, 2023