బ్రిటన్ లోని లీసెస్టర్ నగరంలో హిందువులపై విషం కక్కుతున్న జిహాదీ ఇస్లామిస్టుల వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. మహమ్మద్ హిజాబ్ అనే ఇస్లామిస్టు హిందువులను, హిందూ మతాన్ని అపహాస్యం చేస్తుండగా.. అతని మద్దతుదారులు ‘అల్లాహో అక్బర్’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముస్లిములపైన హిందువులు దాడులు చేస్తున్నా మనం సంయమనం వహిస్తున్నామని అతగాడు కేకలు పెడుతున్నాడు.
హిజాబ్.. హిందువులను గ్యాంగ్ స్టర్లుగా.. ఇండియా నుంచి అక్రమంగా వచ్చిన వారుగా ద్వేష పూరిత ప్రసంగం చేస్తూ.. మరింత రెచ్చగొడుతున్నాడని ఇవి చెప్పకనే చెబుతున్నాయి. లండన్ నుంచి లీసెస్టర్ వరకు ఇతడు ఇలాగే దుష్ప్రచారం చేస్తున్నాడని ట్విట్టర్లో అనేకమంది దుయ్యబట్టారు. మరో ఇస్లామిస్ట్ మజీద్ ఫ్రీమన్ సైతం ఇలాగే హింసకు కారణమవుతున్నాడని వారు ఆరోపించారు.
🚨Breaking News🚨
A video of the evening of the cricket match on the 28th August in Leicester has come to light. It appears a drunk Pakistani was belligerent & snatched an Indian flag from someone & swore at the Indians. He was then assaulted.
Hat tip @Ashwin733561741 pic.twitter.com/YC5DibCDUp
— David Atherton (@DaveAtherton20) September 23, 2022
ఆగస్టు 28 న లీసెస్టర్ లో ఇండియా-పాక్ మ్యాచ్ జరిగిన అనంతరం మద్యం తాగిన మత్తులో ఉన్న పాకిస్థాన్ యువకుడు అక్కడ వీరంగం సృష్టించాడు. ఒకరి చేతిలో ఉన్న భారత జాతీయ జెండాను లాక్కుని తనను ఆపబోయినవారిపై దాడికి దిగుతూ నానా రభసకు పాల్పడ్డాడు.
పరుగెత్తుతుండగా పాకిస్తానీయులు కొందరు అతడ్ని రెచ్చగొట్టడం. మరికొంత మంది అతనిపై దాడి చేసిన దృశ్యాలు వీడియోకెక్కాయి. పాకిస్తాన్ కి అనుకూలంగా, ఇండియాకు వ్యతిరేకంగా ఆ యువకుడు నినాదాలు చేశాడని, అతడిని అతి కష్టం మీద అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఆ మరుసటి రోజు నుంచే లీసెస్టర్ లో ముస్లిములు హిందువులపై దాడులకు దిగారని వార్తలు వస్తున్నాయి.