‘అత్తారింటికి దారేది’పవన్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా. అంతే కాదు అతని ఇమేజ్ ని, మైలేజ్ ని మరింత పెంచిన సినిమా. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రెండవ సినిమా గా వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదలకు ముందే పైరసీ, ప్లాప్ టాక్ లను దాటుకుని వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇంత బిగ్గెస్ట్ హిట్ అయిన ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ కేవలం సింగిల్ ఫోన్ కాల్ లోనే వినిపించారట. స్టోరీ లైన్ విన్న పవన్ త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే మూవీ సెట్స్ పైకి వెళ్లింది.
సినిమాలో అత్త క్యారెక్టర్ మెయిన్ రోల్ కావడంతో ఆ రోల్ లో ఎవరిని ఎంపిక చేశారని త్రివిక్రమ్ పవన్ అడగడంతో…నదియా అని చెప్పగానే కన్విన్స్ అయ్యారట పవన్.
మరదలు క్యారెక్టర్ కోసం సమంత స్థానంలో మొదట ఇలియానాను తీసుకోవాలని భావించగా, అప్పటికీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో ఇలియానా నో చెప్పడంతో..ఆ స్థానంలో సమంతను తీసుకున్నారంట. ఇక ఈ సినిమాలో ఫారెన్ లొకేషన్స్ ను సెర్చ్ చేయడానికి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారట.
అయితే సినిమా నిమిత్తం లొకేషన్స్ చూడ్డానికి పవన్ స్వయంగా వెళ్ళడం ఇదే తొలిసారట. సుమారు 30 నుంచి 45 రోజుల పాటు అక్కడ షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారంట. అన్ని కుదరడంతో సినిమా మంచి విజయం సాధించింది. 61వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సినిమాకు 4 అవార్డులు వచ్చాయి.
అయితే సినిమాలో త్రివిక్రమ్ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాడు. మచ్చుకి ఒకటి చూద్దాం. పవన్ కళ్యాణ్ ఓ సీన్ లో కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అయితే అదే సమయంలో అలీ వచ్చి ఒక సిగరెట్ తీసుకురా అని ఆర్డర్ వేస్తాడు.
దాంతో పవన్ కళ్యాణ్ రగిలిపోయి తన బౌన్సర్ లతో కొట్టిస్తాడు. అంతే కాకుండా తాను డ్రైవర్ కాదని తన గురించి అసలు నిజాలు బయటపెడతాడు. ఇక కోపం లో కొట్టిన పవన్ ఆ తరవాత ఆలీ కి లక్షల డబ్బు ఉన్న ఒక సూట్ కేస్ ఇస్తాడు.
అయితే అప్పటికే ఈ సూట్ కేస్ ను ఎం.ఎస్ నారాయణ పవన్ కు తెరచి చూపించాడు. కానీ అలీ మాత్రం అదే సూట్ కేస్ ను తీసుకువెళ్ళి ఓపెన్ అవ్వడంలేదని చెబుతాడు. అసలు ఈ లాజిక్ అలా ఎలా మిస్ అయ్యావు అంటూ నెటిజన్స్ త్రివిక్రమ్‌ని అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉంటారు.
Also Read: ఎన్టీఆర్ @30 ఇంట్రస్టింగ్ అప్ డేట్స్…!