సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి దారుణ హత్య కేసులో మరోకరు బలైపోయారు. మంటల్లో చిక్కుకున్న ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన అటెండర్ చంద్రయ్య మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. కాలిన గాయాలతో… డీఆర్డీవో ఆసుపత్రిలో చికిత్స పొందతున్న చంద్రయ్య తెల్లవారు జామున గుండెపోటుతో మరణించారు.
ఇప్పటికే ఈ ఘటనలో విజయారెడ్డి, డ్రైవర్, నిందితుడు సురేష్ కాలిన గాయాలతో చనిపోగా… తాజాగా చంద్రయ్య కూడా చనిపోవటంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.