నటుడిగా నిర్మాతగా బండ్ల గణేష్ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాలలో నటించి ఫేమస్ అయిన దానికంటే స్టేజ్ పై మాట్లాడే మాటలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. బండ్ల గణేష్ మైకు పట్టుకుని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే.. అభిమానుల ఈలలు గోల మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ ను ఎవరు ఏ చిన్నమాట అన్నా సరే అసలు ఊరుకోడు. తాను పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిని అంటూ మాట్లాడతారు.
చిరు ఇంట్లో బాలయ్య సినిమా షూటింగ్…మీకు తెలుసా ఈ విషయం!!
అయితే తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ట్విట్టర్ లో బండ్ల గణేష్ పెట్టిన ఆడియో చూస్తుంటే పవన్ కళ్యాణ్ గణేష్ ను దూరం పెట్టినట్లు అర్థమవుతుంది. జీవితంలో ఎవరిని నమ్మకూడదు కేవలం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనల్ని నమ్ముకుని వచ్చిన భార్య మన పిల్లలను మాత్రమే నమ్మాలి.
ఎన్టీఆర్ ఆఖరిగా అనుకున్న సినిమా కథ ఇదే…ఇప్పుడు బాలయ్య దగ్గర ఉందట!
వారి కోసమే బతకాలి… వాళ్ళు మన పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి జీవితం ఇవ్వాలి, మనకి జన్మించిన పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చారు. మనం ఇష్టపడిన వారి కోసం మనల్ని నమ్ముకున్న వారిని మోసం చేయకూడదు అంటూ బండ్ల గణేష్ తెలిపారు.
అయితే ఇందులో పవన్ పేరు ఎక్కడ ప్రస్తావించక పోయినా బండ్ల గణేష్ పరోక్షంగా పవన్ ని ఉద్దేశించి మాట్లాడారు అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మరికొంత మంది నెటిజన్లు దేవుడు వరం ఇవ్వలేదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి పవన్ కోసమే బండ్ల గణేష్ ఆడియో పెట్టాడా ఇంకేమైనా కారణాలున్నాయా అనేది తెలియాల్సి ఉంది.
— BANDLA GANESH. (@ganeshbandla) June 18, 2022
Advertisements