సంచలన విజయంతో చిత్ర పరిశ్రమను తన వైపుకు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ తో జతకట్టారు. సలార్ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మూవీలో లోకల్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేవలం నాలుగు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలన్న లక్ష్యంగా అడుగులు వేస్తున్న నిర్మాతలు… హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీ షూట్ తర్వాతే ప్రభాస్ ఆదిపురుష్ కు షిఫ్ట్ కానుండగా… రాధే శ్యామ్ షూటింగ్ చివరి దశలో ఉంది.