బోర్డర్-గవాస్కర్ టోర్నీలో భాగంగా నాల్గో టెస్ట్ ఆడుతున్న బ్రిస్బెన్ లో ఆసీస్ ప్రేక్షుకులు మరోసారి ఇండియన్ ప్లేయర్స్ ను టార్గెట్ చేశారు. మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ టార్గెట్ గా జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే మూడో టెస్టులో సిరాజ్, బుమ్రాపై జాత్యంహంకార వ్యాఖ్యలు చేయటంతో ఆటగాళ్లు ఎంపైర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా భారత ఆటగాళ్లకు, బోర్డుకు క్షమాపణ చెప్పింది. ఇప్పుడు మరోసారి ఇదే పునరావృతం కావటంపై భారత ఆటగాళ్లు మరోసారి ఎంపైర్లకు, బీసీసీఐకి ఫిర్యాదు చేశారు.
తాము విచారణ జరిపిస్తున్నామని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని… క్రికెట్ ఆస్ట్రేలియా బీసీసీఐకి మాటిచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ పునరావృతం కావటంతో బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.