ప్రపంచ స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటు తో కన్ను మూసాడు. 52 లో ఈ లెగ్ స్పిన్ దిగ్గజం కాసేపటి క్రితం గుండెపోటు తో మరణించాడని ఆస్ట్రేలియా మీడియా ప్రకటించింది. టెస్ట్ క్రికెట్ లో అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. 145 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన వార్న్… 708 వికెట్ లో తీసి మురళీ ధరన్ తర్వాత టెస్ట్ లలో అత్యధిక వికెట్ లు తీసిన బౌలర్ గా నిలిచాడు.
12 గంటల ముందే… ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్… రాడ్ మార్ష్ మృతి పై ఆయన ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసారు. ఆయన మృతితో క్రికెట్ ప్రపంచం నివ్వెర పోయింది. ఐపిఎల్ లో కూడా ఆయన ప్రభావం చూపించారు. ఐపిఎల్ లో 55 మ్యాచ్ లు ఆడిన వార్న్ 57 వికెట్ లు తీసారు. లెగ్ స్పిన్ కు కొత్త అర్ధం చెప్పాడు. 194 వన్డేలు ఆడిన వార్న్ 293 వికెట్ లు తీసాడు.
ఇంగ్లాండ్, భారత జట్లకు అతను సింహ స్వప్నంలా నిలిచాడు. ఇక వివాదాలతో అతను నిత్యం సావాసం చేసే వాడు వార్న్. అమ్మాయిల పిచ్చోడు అనే విమర్శలు కూడా ఉన్నాయి. దూకుడు మనస్తత్వం ఉన్న వార్న్ కు స్లెడ్జింగ్ లో కూడా దిట్టగా పేరుంది. ఆస్ట్రేలియా క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత కూడా అతని పేరు ఎక్కువగా వినపడింది. అతను వేసిన ఎన్నో బంతులు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.