కరోనా వైరస్ కారణంగా అన్ని క్రీడా ప్రపంచం మూగబోయింది. అంతే కాదు వివాహాలను సైతం నిలిపి వేసేలా చేసింది.అయితే అక్కడి ఒక పత్రికలో వచ్చిన సమాచారం ప్రకారం, ఎనిమిది మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ వివాహాలను వాయిదా వేశారు. అయితే కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వివాహాన్ని వాయిదా వేసిన క్రికెటర్లలో ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జాంపా, పేసర్ జాక్సన్ బర్డ్, ఓపెనర్ డి’ఆర్సీ షార్ట్, అన్‌కాప్డ్ మిచెల్ స్వెప్సన్, అలిస్టర్ మెక్‌డెర్మాట్, ఆండ్రూ టై, జెస్ జోనాసెన్ మరియు కాట్లిన్ ఫ్రైట్ లు ఉన్నారు.
ఈ 8 మంది ఆసీస్ క్రికెటర్లు ఈ నెలలో తమ వివాహాలు చేసుకోవాలని అనుకున్నారు కానీ ఇప్పుడు వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ కారణంగా వీరంతా వాటిని వాయిదా వేయవలసి వచ్చింది. అలాగే దక్షిణాఫ్రికా క్రికెటర్ లిజెల్ లీ మరియు టాంజా క్రోన్జే ఏప్రిల్ 10 న జరగాల్సిన వివాహాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.