ఆస్ట్రేలియా ఇండియాల మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన 3వ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ ఇండియన్ క్రికెటర్స్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సాధారణంగా స్లెడ్జింగ్ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు కామన్ ….ఈ రోగం ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ కు కూడా అంటుకోవడం ఘోరం!
3వ టెస్ట్ 4వ రోజు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ ను ఉద్దేశించి ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ …’Brown Dog’ ‘Big Monkeyస అంటూ కామెంట్ చేశారు., ఇక బుమ్రాను కూడా Bum-Rash అంటూ కామెంట్ చేశారు.
ఈ విషయమై…ఇండియన్ కెప్టెన్ రెహానే గ్రౌండ్ ఎంపైర్స్ తో పాటు., మ్యాచ్ రిఫరీకి పిర్యాదు చేశాడు…. ఈ కామెంట్స్ చేసిన 4 గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం!
ఇండియాలో ఇలా జరిగినప్పుడు :
ఇండియాలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు క్రికెట్ ఆడుతున్నప్పుడు శృతితప్పిన ఇండియన్ ఫ్యాన్స్ స్మిత్ టీజ్ చేస్తుంటే…. కోహ్లీ గ్రౌండ్ నుండే ప్రేక్షకులను ఉద్దేశించి అలా అనొద్దని రిక్వెస్ట్ చేశాడు…దీంతో ఆడియన్స్ కామ్ అయిపోయారు. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఆ సోయి ఏ మాత్రం లేకపోవడం గమనార్హం!