గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను గ్రాండ్‌గా ముగించాలనుకున్న సానియా ఆశలపై బ్రెజిల్ జోడి నీళ్లు చల్లింది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్- 2023 ఫైనల్ పోరులో సానియా-బోపన్న జోడి పరాజయం పాలైంది.తన 18ఏళ్ల గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను టైటిల్‌తో ముగించాలని భావించిన సానియాకు నిరాశే ఎదురైంది. టైటిల్ పోరులో సానియా-బోపన్న జోడీ వరుస సెట్లలో ఓడిపోయింది. 7-6(2), 6-2 తేడాతో బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ, రఫెల్ మాటోస్ చేతిలో ఓడిపోయింది.
గంటపాటు జరిగిన ఫైనల్లో సానియా జోడి ఏ దశలోనూ ఫైట్ ఇవ్వలేకపోయింది. ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో కెరీర్ గ్రాండ్‌స్లామ్ ముగించిన సానియా వచ్చే నెలలో జరగనున్న దుబాయ్ ఓపెన్‌లో ఆడనుంది. అదే తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు ఆఖరి టోర్నమెంట్. అంటే ఫబ్రవరి చివరి నాటికి సానియా రిటైర్ అవుతారు. ఆ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నిలో మనం సానియాను చూడలేం.
మ్యాచ్ తర్వాత మాట్లాడిన సానియా ఏడ్చేసింది. తన కెరీర్‌ను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైంది. తన టెన్నిస్ ప్రయాణం గురించి మాట్లాడుతూ సానియా కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు భారత్ క్రీడాభిమానులకు కన్నీరు తెప్పిస్తున్నాయి. తన వృత్తిపరమైన కెరీర్ మెల్బోర్న్‌లోనే ప్రారంభమైందని సానియా గుర్తు చేసుకుంది. తన కొడుకు ముందే తాను గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లో ఆడగలనని ఎప్పుడూ అనుకోలేదంటూ ఉద్వేగానికి లోనైంది సోనియా.
సింగిల్స్ ప్లేయర్‌గా గ్రాండ్‌స్లామ్ కెరీర్ ఆరంభించిన సానియా తర్వాత డబుల్స్, మిక్సడ్ డబుల్స్ ప్లేయర్‌గా మారింది. డబుల్స్, మిక్సడ్ డబుల్స్‌లో ఎన్నో మరుపురాని విజయాలను అందుకున్నారామె. ఆరు గ్రాండ్ స్లామ్‌లతో సహా మొత్తం 43 డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది సానియా. గతంలో మహిళల డబుల్స్ విభాగంలో 91 వారాల పాటు డబ్ల్యూటీఏ నంబర్ 1 ప్లేయర్‌గానూ సానియా నిలిచింది. దేశంలో యువత టెన్నిస్ పట్ల ఆకర్షితులవడానికి సానియానే కారణం అనడంలో ఎలాంటి సందేహంలేదు.
“My professional career started in Melbourne… I couldn’t think of a better arena to finish my [Grand Slam] career at.”
We love you, Sania ❤️@MirzaSania • #AusOpen • #AO2023 pic.twitter.com/E0dNogh1d0
— #AusOpen (@AustralianOpen) January 27, 2023