ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిడ్నీ టెస్ట్ మ్యాచులో ఆస్ట్రేలియన్ ప్రేక్షకుల నోటి దురుసు ఆగటం లేదు. తాజాగా మరోసారి బౌలర్ సిరాజ్ పై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. మూడో రోజు ఆటలో ఇలాంటి సందర్భమే ఎదురుకాగా… నాలుగోరోజు సైతం ఇలాంటివే కనిపించాయి.
సిరాజ్ బౌలింగ్ లో కామెరూన్ గ్రీన్ వరుస సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత బౌండరీ లైన్ వద్ద సిరాజ్ ఫీల్డింగ్ చేస్తుండగా… ప్రేక్షకుల్లోని ఓ గుంపు సిరాజ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో సిరాజ్ కెప్టెన్ కు విషయం చెప్పగా, రహానే ఎంపైర్లకు ఫిర్యాదు చేశాడు.
దీంతో మ్యాచ్ ఆపేసిన ఎంపైర్లు… వారు ఎవరో గుర్తుపట్టాలని కోరారు. సిరాజ్, రహానే వారిని చూపించగా… ఎంపైర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ గుంపును భయటకు పంపగా, కొందరు పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. వారి చేతిలో మద్యం సీసాలున్నట్లు తెలుస్తోంది.