హైదరాబాద్ మెట్రో రైళ్లు మొరాయిస్తున్నాయి. తాజాగా మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్ లోని గాంధీభవన్ స్టేషన్‌లో మెట్రో రైల్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రైళ్లు ఆగిపోతున్నాయని అధికారులంటున్నారు. ముసారాం బాగ్‌లో 15 నిమిషాలుగా మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అయితే తరచూ సాంకేతిక సమస్యలు ఏర్పడి మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో … [Read more...] about మొరాయిస్తున్న మెట్రో రైళ్లు
హక్కుల రక్షణ కోసమే రైతుల ఉద్యమం- కోదండరాం
రైతులు తమ హక్కులను రక్షించుకోవడం కోసమే ఉద్యమాలు చేస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి సంఘీభావంగా మంగళవారం హైదరాబాదులో అఖిలపక్షం మద్దతుతో నిర్వహించిన రైతు ర్యాలీలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సాగు చట్టాలతో కార్పొరేట్ కంపెనీల హక్కులను కేంద్ర … [Read more...] about హక్కుల రక్షణ కోసమే రైతుల ఉద్యమం- కోదండరాం
ద్వివేది మెడకు చుట్టుకుంటున్న ఏపీ ఎన్నికల పంచాయితీ
ఏపీలో ఎన్నికల సంఘం- ప్రభుత్వానికి మధ్య జరిగిన ఆధిపత్య పోరు చిట్టచివరకు పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ మెడకు చుట్టుకుంటుంది. ప్రధానంగా 2021ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించకపోవటం తప్పిదం అంతా ఆయనదేనని ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెన్సూర్ ప్రొసిడింగ్స్ ఇచ్చేశారు. కేవలం సస్పెన్షన్ తోనే సరిపెట్టకుండా ద్వివేదీ … [Read more...] about ద్వివేది మెడకు చుట్టుకుంటున్న ఏపీ ఎన్నికల పంచాయితీ
పుష్ప ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామ
అల వైకుంఠపురములో సినిమా తర్వాత మరో హిట్ కోసం అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమా పుష్ప. గందపు చెక్కల స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా, సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. బన్సీ సరసన రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూట్ శరవేగంగా సాగుతుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఎప్పట్లాగే ఈ సినిమా … [Read more...] about పుష్ప ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామ
రైతన్నలపై పోలీసుల దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి
ఢిల్లీలో శాంతియుతంగా కిసాన్ కవాతు చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీచార్జ్, బాష్పవాయువు గోళాలు ప్రయోగించటంపై ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ట్రాక్టర్ ర్యాలీ కి పోలీస్ లే అనుమతిచ్చి దాడి చేశారని మండిపడ్డారు. ఢిల్లీ వీధుల్లో రైతన్న పై దాడి చేసిన చరిత్ర ప్రధాన మంత్రి మోడి కే దక్కుతోందన్నారు … [Read more...] about రైతన్నలపై పోలీసుల దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి
రైతు ఆందోళనలపై హోంశాఖ అత్యవసర భేటీ
దేశ రాజధాని నడిబొడ్డున రైతుల కవాతు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఓవైపు ఎర్రకోట పరిసర ప్రాంతాల నుండి శాంతియుతంగా రైతులను పంపించి వేస్తూనే... ఉదయం నుండి జరిగిన ట్రాక్టర్ల ర్యాలీ, రైతులు ఎర్రకోట వైపు రావటం సహా అన్ని అంశాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీకి కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు సహా ఢిల్లీ పోలీసు … [Read more...] about రైతు ఆందోళనలపై హోంశాఖ అత్యవసర భేటీ
ఇది కాంట్రాక్టర్ల గుప్పిట్లో ఉన్న తెలంగాణ
తెలంగాణ తెచ్చుకున్నందుకు ఏడ్వాలో... నవ్వాలో తెలియని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి. తాము ఆధారాలతో సహా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని భయటపెట్టానని, స్వయంగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. బీహెచ్ఈఎల్ పంపుల విషయంలో చోటుచేసుకున్న అవినీతిని ప్రస్తావించానని, ఏకంగా 7,348 కోట్ల అగ్రిమెంట్ చేసుకొని దోచుకున్నారని … [Read more...] about ఇది కాంట్రాక్టర్ల గుప్పిట్లో ఉన్న తెలంగాణ
సచివాలయ నిర్మాణాలను పరిశీలించిన కేసీఆర్
దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత సీఎం కేసీఆర్ సచివాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే పాత సచివాలయాన్ని కూల్చి, కొత్త సచివాలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన సచివాలయ పనులను కేసీఆర్ పరిశీలించారు. ప్రతి బ్లాక్ నిర్మాణాన్ని పరిశీలించి, నిర్మాణ పనుల్లో నిమగ్నమైవున్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిధులతో మాట్లాడారు. నిర్మాణంలో వేగం … [Read more...] about సచివాలయ నిర్మాణాలను పరిశీలించిన కేసీఆర్
రైతు ఉద్యమంలో అపశృతి- సింఘ్ బార్డర్ లో రైతు మృతి
ఢిల్లీ నడిబొడ్డున రైతుల ఉద్యమం కొనసాగుతుంది. వేలాది మంది పోలీసులను లెక్క చేయకుండా కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఢిల్లీకి వచ్చే అన్ని వైపుల నుండి ట్రాక్టర్లతో భారీసంఖ్యలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీకి తరలివచ్చారు. ఇక ఢిల్లీ-హార్యానా సరిహద్దులోని సింఘు బార్డర్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. అక్కడ ఏర్పడిన ఉద్రిక్త … [Read more...] about రైతు ఉద్యమంలో అపశృతి- సింఘ్ బార్డర్ లో రైతు మృతి
ఎర్రకోటపై ఢిల్లీ రైతుల కవాతు
రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఎర్రకోటకు చేరింది. పోలీసుల ఆంక్షలను చేధించుకుంటూ, టియర్ గ్యాస్ వాయుగోళాలకు వెన్నుచూపకుండా, వేలాది పోలీసులను చేధించుకొని రైతులు ఎర్రకోటపై త్రివర్ణ జెండాతో తమ నిరసన గళాన్ని వినిపించారు. త్రివిధ దళాలకు పోటీగా అన్నట్లుగా రైతుల కవాతు సాగింది. ఢిల్లీకి చేరే రోడ్లు మాత్రమే కాదు... ఢిల్లీలోని ప్రధాన రహాదారులన్నీ రైతులతో … [Read more...] about ఎర్రకోటపై ఢిల్లీ రైతుల కవాతు