ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీ కొకైన్ బయటపడింది. విమానాశ్రయం గేట్ నెంబర్ 11 వద్ద ఓ కవర్ ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అందులో కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు ఉన్నట్టు గుర్తించారు. దేశాలు దాటించే ప్రయత్నంలో దానిని అక్కడ వదిలేసి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు
ఆ కవర్లో 51 క్యాప్స్యూల్స్ లో కొకైన్ ను ఉన్నట్టు కస్టమ్స్ బృందం తెలిపింది. దీని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనా వేస్తింది.
అయితే.. ఎయిర్ పోర్టులో డ్రగ్స్ పట్టుబడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కస్టమ్స్ అధికారుల కదలికలను గుర్తించిన స్మగ్లర్లు.. మాదకద్రవ్యాలు ఉన్న కవర్ ను గేట్ వద్ద వదిలేసి పారిపోయినట్టు అనుమానిస్తున్నారు.
ఈ కవర్ ను ఎవరు తెచ్చారు? వాళ్లు ఏ దేశం నుంచి వచ్చారు? అనే విషయాలపై దర్యాప్తును ప్రారంభించారు పోలీసులు. ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.