తిరుపతి నుండి తిరుమలకు వెళ్లాల్సిన అలిపిరి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. మంగళవారం రాత్రి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో ఈ ఘాట్ రోడ్డు ను మూసివేశారు. రోడ్డు మీద కొండచరియలు విరిగిపడడంతో అలిపిరి వద్ద భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. మరమ్మతులు చేయడానికి 24 గంటలు పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇక ఇటీవల గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.