అతివేగం కారణంగా ఆటో బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం బెన్నవరం వద్ద చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఉన్న మరో ఇద్దరికీ తీవ్రంగా గాయాలు కావటంతో వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం స్థానిక హాస్పిటల్ కి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, అతివేగమే కారణమా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.