ఎవరో వస్తారు ఏదో చేస్తారని కూర్చుంటే అవకాశాలు అటునుంచి అటే పోతాయి.ఈ తరం అవకాశాల కోసం ఎదరు చూసే తరం కాదు. అవకాశాలు సృష్టించుకునే కాలం. ఈతరం ఇంట్రప్రెన్యూర్లది గుండెల్లో నిండిన నమ్మకం.
వారు ఎవరి దగ్గరా ఉద్యోగాలు చేయరు. ఉద్యోగాలిస్తారు. ఒక వేళ ఉద్యోగమంటూ చేస్తే అది వాళ్ళ సొంత ఆఫీసులోనే అయ్యుంటుంది. అయితే వీరంతా ఎత్తైన బిల్డింగుల్లోనో లగ్జరీ క్యాబిన్లలోనో కనిపించరు.
కంటినిండా కలలు నింపుకున్న ఓ చాయ్‌వాలా, ఓ ఆటోవాలాలోనూ ఎంట్రప్రెన్యూర్ కనిపించవచ్చు. బెంగళూర్‌లో జనార్ధన్ అనే ఆటోడ్రైవర్ ఈ కోవలోకే వస్తాడు. ఈ ఆటోడ్రైవర్ స్టోరీని సుశాంత్ కోషీ ట్విట్‌ర్‌లో షేర్ చేశారు.
సుశాంత్ పోస్ట్ లో జనార్ధన్ ఆటో ఫొటో కనిపిస్తుంది. ఆటోలోపల నా యూట్యూబ్ చానల్ గోల్డ్ జనార్ధన్ ఇన్వెస్టర్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి అని ప్లకార్డు కనిపిస్తుంది.
ఈరోజు నా ఉబర్ ఆటో డ్రైవర్ పర్సనల్ ఫైనాన్స్ లో నిపుణుడైన యూట్యూబ్ ఇన్‌ఫ్లుయన్సర్ అని పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చారు. జనార్ధన్ యూట్యూబ్ చానెల్ చూస్తే ఆశ్చర్యానికి లోనయ్యానని కోషీ రాసుకొచ్చారు.
కేంద్ర బ్యాంకులు కేవలం డబ్బును ముద్రించడానికే కాదని అవెన్నో కీలక విధులను నిర్వర్తిస్తాయని అతడు వివరించిన తీరు అద్భుతమని కొనియాడారు.
సంక్లిష్టమైన ఆర్ధిక అంశాలను అవగాహన చేసుకునేందుకు, ఆటో నడుపుతూనే గ్రాఫిక్స్‌తో కూడిన వీడియోలను రూపొందించడం వంటి ఎన్నో ప్రత్యేకతల కోసం జనార్ధన్ చానెల్‌ను ఫాలో కావాలని సుశాంత్ కోషీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
My Uber auto driver today is a YouTube influencer, specialising in personal finance. @peakbengaluru https://t.co/FZJWWzMFhB pic.twitter.com/crM8Im9JOK
— Sushant Koshy (@sushantkoshy) March 3, 2023