తమ డ్రైవింగ్ నైపుణ్యంతో చూపరులను ఆకట్టుకున్నారు మహరాష్ట్రా ఆటోవాలాలు. సంఘమేశ్వర యాత్రలో భాగంగా సంగ్లీ జిల్లా హరిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన రివర్స్ ఆటోరిక్షా డ్రైవింగ్ పోటీలు వైరల్ అయ్యి నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి.
ఈ పోటీల్లో పలువురు ఆటోవాలాలు పాల్గొని దుమ్మురేపే డ్రైవింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. కిలోమీటర్ల దూరం వరకు ఆగకుండా హైస్పీడ్‌తో ఆటోను రివర్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఈ పోటీలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఆటోవాలాలప్రతిభను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
#WATCH | Maharashtra: A reverse auto rickshaw driving competition was organised at Haripur village, Sangli on the occasion of Sangameshwar Yatra today. pic.twitter.com/dlkMdompnz
— ANI (@ANI) January 24, 2023