జమ్మూ కశ్మీర్ లో ఓ ఆర్మీ పోస్టుపై మంచు చెరియలు విరిగిపడడంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో జవాన్ గాయపడ్డారు. ఒక జవాన్ జాడ కనిపించడం లేదు. కుప్వారా జిల్లా మాచిల్ సెక్టార్ లో ఈ సంఘటన జరిగింది. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మంచు చెరియలు విరిగిపడ్డాయి. గందెర్ బాల్ జిల్లా సోన్ మార్గ్ లో జరిగిన ఘటనలో ఐదుగురు పౌరులు చనిపోయారు. ఐదుగురిని రెస్క్యూ టీమ్ రక్షించింది. గత 48 గంటల్లో విపరీతమైన మంచు కురుస్తుండడంతో ఉత్తర కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో మంచు చెరియలు విరిగిపడుతున్నాయి. పలువురు సైనికులను రెస్క్యూ టీమ్ రక్షించింది.