లాంగ్ మార్చ్ అని చెప్పి రెండు కిలోమీటర్లు కూడా నడవలేని పవన్ నీతులు చెప్పటం విడ్డురంగా ఉందన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. పుస్తకాలు చదివినంత మాత్రాన రాజకీయనాయకులు కాలేరంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఇంకా సినిమా మాయలో ఉన్నాడు. పార్టీ పెట్టి పరువు పోగొట్టుకుని ఇంకా దిగజారుతున్నాడన్నారు అవంతి. లాంగ్ మార్చ్ అని చెప్పి రెండు కిలోమీటర్లు కూడా నడవలేని పవన్, మూడు వేల కిలోమీటర్లు నడిచిన జగన్ ను గుర్తుతెచ్చుకోవాలన్నారు. పవన్ ఇష్టం వాచినట్టు మాట్లాడుతున్నాడు. వైసీపీ నేతలకు ఇసుక రవాణాతో సంబంధం ఉందని నిరూపించండి అంటూ సవాల్ విసిరారు. భవన నిర్మాణ కార్మికుల పై పవన్ కు అంత ప్రేమ ఉంటె ఒక సినిమా ఉచితంగా తీసాననుకుని ఆ డబ్బులు కార్మికులకు పంచండన్నారు.
భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ విశాఖ లో ఆదివారం లాంగ్ మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. పవన్ కు టీడీపీ, బీజేపీ లు కూడా మద్దతుగా నిలిచాయి.