ప్రపంచవ్యాప్తంగా 2022లో చాలా సినిమాలొచ్చాయి. చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, కొన్ని సినిమాలు హిట్టయ్యాయి. వరల్డ్ వైడ్ హిట్టయిన సినిమాగా టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ నిలిచింది. 2022లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదేనంటూ మొన్నటివరకు అంతా కథనాలు ఇచ్చారు.
కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. టామ్ క్రూజ్ కు ఆ ఘనత అందకుండా చేశాడు దర్శకుడు జేమ్స్ కామరూన్. అవతార్-ది వే ఆఫ్ వాటర్ సినిమాతో 2022లో బిగ్గెస్ట్ హిట్ మూవీ స్థానాన్ని తను కొట్టేశాడు.
అవును.. 2022లో ప్రపంచవ్యాప్తంగా హిట్టయిన సినిమాగా అవతార్-2 నిలిచింది. టాప్ గన్ మేవరిక్ సినిమాను రెండో స్థానానికి నెట్టేసింది. మొన్నటివరకు టామ్ క్రూజ్ సినిమా 11,548 కోట్ల రూపాయలతో 2022 సంవత్సరానికి గాను అగ్రస్థానంలో ఉండేది. 12,505 కోట్ల రూపాయల వసూళ్లతో ఆ స్థానాన్ని అవతార్-2 ఆక్రమించింది.
అలా 2022లో అత్యథిక వసూళ్లు సాధించి, బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అవతార్-2 సినిమా. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 4వ వారంలోకి ఎంటరైంది. అయితే సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 2 బిలియన్ డాలర్ల వసూళ్లు రావాలి. ప్రస్తుతం 1.58 బిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి.