జేమ్స్ కామరూన్ సృష్టించిన విజువల్ వండర్ అవతార్-ది వే ఆఫ్ వాటర్. ఇప్పుడీ సినిమా ఇండియాలో వండర్ క్రియేట్ చేసింది. భారత్ లో అతిపెద్ద హిట్టయిన హాలీవుడ్ సినిమాగా రికార్డ్ సృష్టించింది అవతార్-2. నిన్నటి వసూళ్లతో ఈ సినిమా ఈ ఘనత సాధించింది.
ఇప్పటివరకు ఇండియాలో అతిపెద్ద విజయం అవెంజర్స్-ది ఎండ్ గేమ్ ది మాత్రమే. ఈ సినిమా 367కోట్ల రూపాయలు ఆర్జించింది. ఇప్పుడీ రికార్డ్ ను అవతార్-2 అధిగమించింది. 368 కోట్ల రూపాయల నెట్ తో భారత్ లో అతిపెద్ద హాలీవుడ్ సినిమాగా అవతరించింది.
అయితే ఇక్కడితో అవతార్-2 హంగామా ముగియడం లేదు. ఈ సినిమాకు ఇండియాలో ఇంకా క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా రిపబ్లిక్ డే హాలీడేస్ వస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఎవెంజర్స్ కు అందనంత ఎత్తులో వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు. అదే కనుక జరిగితే మరో హాలీవుడ్ సినిమాకు ఈ రికార్డ్ క్రాస్ చేయడం దాదాపు అసాధ్యం అవుతుంది.
అవతార్-2 సినిమాకు త్రీడీ అద్భుతంగా కలిసొచ్చింది. ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఐమ్యాక్స్ లేదా త్రీడీలో చూడ్డానికి ఇష్టపడుతున్నారు. దీంతో మల్టీప్లెక్సుల్లో ఈ సినిమాకు భారీగా వసూళ్లు వస్తున్నాయి. సింగిల్ స్క్రీన్స్ నుంచి మాత్రం ఈ సినిమాను ఇప్పటికే తొలిగించారు.