హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ 2009లో తెరకెక్కించిన ‘అవతార్’ సినిమాను సినీ ప్రియులు మరిచిపోలేరు. హైలెవెల్ గ్రాఫిక్ వర్క్‌తో సినీ ప్రేక్షకులు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త ప్రపంచాన్ని చూపించాడు దర్శకుడు. ఎన్నో అద్భుతాలు ఉన్న అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘అవతార్ 2’ డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలోనే ‘అవతార్ 2’ ట్రైలర్‌ను ‘డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్’ సినిమాతో పాటే.. మే 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ కోసమే డాక్టర్ స్ట్రేంజ్ మూవీకి భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఈ ట్రైలర్ విడుదలకు ముందే.. లీకై సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనట్లు తెలుస్తుంది. ఊహించని విధంగా ఈ లీకేజీకి సంబంధించిన ఫుటేజ్ లింక్‌లు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
అయితే ప్రస్తుతం ఫుటేజ్‌కు సంబంధించిన లింక్‌లు, ఫోటోలు ట్విటర్ డిలీట్ చేయడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఈ ట్రైలర్ ఎవరు లీక్ చేశారు..? ఎలా లీక్ చేశారు..? అన్న విషయాలేవి ఇంతవరకు తెలియలేదు. మరోవైపు ఇది ఒక ప్రమోషన్ స్టంట్ అని పలువురు నెటిజన్స్ భావిస్తున్నారు.
Advertisements
ఇదిలా ఉంటే.. లీకైన ఈ ట్రైలర్ చూసిన వారు.. అవతార్ టు మరో విజువల్ వండర్ అని అంటున్నారు. దర్శకుడు జేమ్స్ కామేరాన్ మరో అద్భుతమైన లోకంలోకి తీసుకెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక అవతార్.. ది వే ఆఫ్ వాటర్ పేరుతో వస్తున్న ఈ సీక్వెల్‌ను ఏకంగా 160 భాషల్లో విడుదల చేయబోతున్నారు.