అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్టయింది. మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలకు ఏ స్థాయిలో వసూళ్లు వస్తాయో.. ఏపీ-నైజాంలో అవతార్-2 సినిమాకు ఆ స్థాయిలో వసూళ్లు వచ్చాయి.
తాజాగా ఈ సినిమా థియేటర్లలో 2 వారాల రన్ పూర్తి చేసుకుంది. ఈ 14 రోజుల్లో అవతార్-2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 76 కోట్ల 68 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది.
బ్రేకప్ చూసుకుంటే.. నైజాం నుంచి ఈ సినిమాకు 41 కోట్ల రూపాయలు.. సీడెడ్ నుంచి 9 కోట్ల 94 లక్షలు, ఆంధ్రా నుంచి 26 కోట్ల 83 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈ అంకెలు చూస్తుంటే.. మల్టీప్లెక్సుల్లో అవతార్-2 సినిమా పెద్ద హిట్ అనే విషయం ఈజీగా అర్థమౌతుంది.
ఈ వీకెండ్ తో అవతార్-2 హడావుడి ముగిసేలా కనిపిస్తోంది. ఆల్రెడీ ధమాకా హిట్టవ్వడం, జనవరి నుంచి సంక్రాంతి సినిమాల కోసం మాత్రమే ప్రేక్షకులు ఎదురుచూడడం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే.. ఈ వారాంతంతో అవతార్-2 సినిమా రన్ ముగిసేలా కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే బిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. వరల్డ్ వైడ్ చూసుకుంటే, అమెరికా తర్వాత చైనా, ఫ్రాన్స్, జపాన్, ఇండియా దేశాల నుంచి ఈ సినిమాకు ఎక్కువగా వసూళ్లు వస్తున్నాయి.