ఉయ్యాల జంపాల సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది అవికాగోర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడమే కాకుండా నటిగా అవికా కు మంచి పేరును తీసుకువచ్చింది. ఆ తరువాత కూడా అవికా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అంత స్థాయిలో హిట్ సాధించలేకపోయాయి. ఇక గత కొంత కాలంగా టాలీవుడ్ లో అవికా సినిమాలు ఎక్కడా కనిపించట్లేదు. అందుకు కారణం లేకపోలేదు. అయితే ఇటీవల అందరినీ షాక్ కి గురి చేస్తూ న్యూస్ లుక్ లో వచ్చి దర్శకనిర్మాతలకు బంపర్ ఆఫర్లను ఇచ్చేస్తోంది. గ్లామర్ పాత్రలో నటించడానికి తాను కూడా సిద్ధమంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
తాజాగా స్విమ్మింగ్ పూల్ పక్కన బికినీతో దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఐటెం సాంగ్స్ లోనూ నటించడానికి రెడీ అంటూ చెప్తుందట. కత్రినా, ప్రియాంక, తమన్నా ఇలా చాలామంది స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ లో నటిస్తున్నారు. అలానే నేను కూడా ఏ అవకాశం వచ్చినా చెయ్యటానికి సిద్ధమంటూ చెప్తుందట.