అక్కినేని నాగార్జున ముందు కన్నీరు పెట్టుకుంది చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్. హీరో గా సాయి రోనక్, హీరోయిన్ గా అవికా గోర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పాప్ కార్న్’. ఈ మూవీ ట్రైలర్ ని టాలీవుడ్ హీరో నాగార్జున లాంచ్ చేశారు. సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అవికా గోర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది.
నాగార్జున ముందు కన్నీరు పెట్టుకుంది. ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ.. ‘నేను ముంబై నుంచి వచ్చా. అయినా నన్ను తెలుగు అభిమానులు సొంత ఫ్యామిలీ మెంబర్ గా ఆదరిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో రాణించడం అంతా ఈజీ కాదు అంటూ’ కామెంట్స్ చేసింది.
ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం ఒక స్టూడియో చూడ్డానికి బ్రెజిల్ లోని రియోకి వెళ్లినట్లు నాగార్జున తెలిపారు. అక్కడ స్పానిష్ భాషలో ఉన్న ఒక బోర్డ్ చూశానని, అప్పుడే అవికా గోర్ ను చూసినట్లు చెప్పారు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ సూపర్ డూపర్ అని, 128 దేశాల్లో ఆ సీరియల్ రిలీజ్ అయిందన్నారు. అవికా గోర్ ఎప్పుడో ‘పాన్ వరల్డ్ స్టార్’ అని ప్రశంసించారు.
అనంతరం ప్రొడ్యూసర్ భోగేంద్ర గుప్తా మాట్లాడుతూ.. కజకిస్థాన్ లో రెండు సినిమాల్లో అవికా నటించిందన్నారు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 10వ తేదీన ‘పాప్ కార్న్’ సినిమా విడుదల చేస్తామని తెలిపారు.