బుల్లితెరపై చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో బాల నటిగా పరిచయం అయిన బామ అవికా గోర్. రాజ్ తరుణ్ హీరోగా ఉయ్యాలా జంపాల సినిమాతో మంచి హిట్ అందుకున్న అవికా ఆ తరువాత లక్ష్మి రావే మాఇంటికి తో వచ్చింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మళ్ళీ సినిమా చూపిస్తా మామ సినిమాతో మరో హిట్ కొట్టింది. తరువాత చేసిన సినిమాలు థియేటర్ల వద్ద ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. చాలా గ్యాప్ తరువాత అవికా నిఖిల్ హీరోగా వచ్చిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో మళ్ళీ హిట్ కొట్టింది. కానీ అవకాశాలు మాత్రం ఈ అమ్మడుకు పెరగలేదు. ప్రస్తుతం అవికా గోర్ ఫోటో షూట్ లు చేస్తూ అవకాశాలు కోసం ఎదురుచూస్తుంది.
Advertisements