మహేష్ బాబు హీరోగా రాబోతున్న సినిమా సర్కారు వారి పాట. ఇందులో మహేష్ కు వదినగా పవన్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ నటిస్తున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. కానీ దీనిపై ఇంతవరకూ ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ సందర్భంగా రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చింది.
ఇలాంటి వార్తలు ఎక్కడ నుండి వస్తాయో తెలియటం లేదని… తను మహేష్ బాబు సినిమాలో నటించటం లేదని తెలిపింది. అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా అభిమానులకు ముందుగానే చెప్పేస్తానంటూ తెలిపింది.
రేణూ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ తో పాటు మరో సినిమా చేస్తుండగా… రైతుల ఇబ్బందులపై సినిమా చేస్తానని ఇప్పటికే ప్రకటించింది.