ఆవుపేడతో అలికిన కారు.. రకరకాల రంగుల్లో ఉండే కార్లను ఇప్పటి వరకు మనం చూసాం. ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ వచ్చింది. ఆవు గురించి విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓ వ్యక్తి తన కారుకు ఆవు పెండతో కోటింగ్ వేయించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తే మీరు కూడా నమ్ముతారు…
కారులో ప్రయాణం చేసినా ఎండ వేడిని తట్టుకునేందుకు ఈ పేడ కోటింగ్ ఉపయోగ పడుతుందట. అందుకే జితిన్ అనే వ్యక్తి తన కారుకు పేడ కోటింగ్ వేయించానంటున్నాడు. తనకున్న మహేంద్ర కారుకు ఆవు పెండతో పూత పూయించాడట. ఒక్క కిటికీలకు తప్ప కారుకు ఉన్న అన్ని మెటల్ వస్తువులకు పేడ కోటింగ్ వేసారట. ఇలా వేయడం వల్ల కారు లోపలికి ఇన్ ప్రారెడ్ కిరణాలు వెళ్లే అవకాశాలు ఉండవట. ఇన్ ఫ్రారెడ్ కిరణాల వల్ల వేడి పుడుతుందనే విషయం మనకు తెలిసిందే. కారు అద్దాలు కొంత వరకు ఆ కిరణాలను తట్టుకుంటాయి. కానీ లోహాలు మాత్రం వేడెక్కుతాయి దీంతో ఎండా కాలంలో కారు ఏసిలు కూడా వేడిని తగ్గించలేని స్థితిలో ఉంటాయి. ఈ పేడ కోటింగ్ వల్ల కార్ రూప్ ఇతర లోహపు వస్తువులు త్వరగా వేడెక్కే అవకాశాలు లేవట. దీంతో కారులోపల బయట కంటే ఒకటి రెండు డిగ్రీల ఉష్టోగ్రత తక్కువగా ఉంటుందట. ఇంతకాలం గోమూత్రంతో అన్ని రోగాలు నయం చేయవచ్చన్న వార్తలే చూసాం.. ఈ వార్తతో ఒక్కసారిగా పేడకు కూడా గిరాకీ ఏర్పడే అవకాశాలున్నాయట.