మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో ఆకాశంలో ఓ అరుదైన సీన్ కనిపించింది. నింగి నుంచి పదుల సంఖ్యలో ఉల్కలు నేలరాలుతూ కనువిందు చేశాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. అయితే.. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో ఉపగ్రహ శకలాలు కనిపించడంతో వాటిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు.
మహారాష్ట్రలోని అమరావతి, విదర్భ, నాగ్ పుర్ సహా మధ్యప్రదేశ్ లోని ఇండోర్, బైతుల్, భోపాల్ లలో ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. రాత్రి సమయంలో నింగిలో నుంచి నిప్పులు చిమ్ముకుంటూ కిందకు పడుతున్నట్లు కనిపించాయి.
అవి బుల్లెట్లలా దూసుకొచ్చినట్లు ఆ దృశ్యాల్లో స్పష్టమవుతోంది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆకాశంలో నుండి నేలపైన పడినవి ఉల్కలేనని అంటున్నారు.
మహారాష్ట్ర అమరావతిలోని శ్రీ శివాజీ సైన్స్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ పంకజ్ నాగ్పురే. మరోవైపు చంద్రపుర్ లో శాటిలైట్ విడిభాగాలు కనిపించాయి. దీంతో అవి ఉల్కలా..? ఉపగ్రహ శకలాలా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.