సమాజంలో నేరప్రవృత్తి బాగా పెరిగిపోతుంది.మహిళలు సైతం నేరాలకు తెగబడుతున్నారు. వీటిలో ఆస్తికోసం ప్రియుడి సహాయంతో భర్తను చంపే ఉదంతాలే ఎక్కువ.ఓ మహిళ ఆస్తి కోసం ప్రియుడితో కలిసి భర్తని స్లోపాయిజన్ ఇచ్చి చంపిన ఉదంతం మరువక ముందో మరోమహిళ ఇదే తరహాలో భర్తను చంపింది. ఓ క్రైమ్ సీరియల్ చూసి స్ఫూర్తిపొంది ఈ మర్డర్ ప్లాన్ చేసానని చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు.ఈ ఘటన ఉత్తర్ ప్రేదేశ్ కాన్పూర్ జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం కాన్పూర్ కి చెందిన రిషబ్ స్వప్న భార్యాభర్తలు గతకొంతకాలంగా కళ్యాణ్ పూర్ లో నివాసముంటున్నారు.నవంబర్ 27 న తన స్నేహితుడు మనీశ్ తో కలిసి ఓ పెళ్ళికి వెళ్ళు రిషబ్. అనంతరం తిరిగి వస్తుండగా కొందరు వ్యక్తులు రిషబ్ పై దాడి చేసారు తీవ్రంగా గాయపడిన అతడు చికిత్సకోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. కొన్ని రోజలకు కోలుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. డిసెంబర్ 3న అతనికి మళ్ళీ ఆరోగ్యం క్షీణించింది. చికిత్సకోసం ఆసుపత్రికి తీసుకువెళ్ళగా చికిత్స పొందుతూ రిషబ్ మరణించాడు.
అనంతరం భర్తమృతిపై పోలీసులకు ఫిర్యాడు చేసింది స్వప్న. తన భర్త మరణంపై అనుమానాలున్నాయని విచారణ జరిపించాలని కోరింది.ఫిర్యాదు తీసుకున్న పోలీసులు రిషబ్ మృతదేహానికి పోస్ట్ మార్టం పరీక్షలు చేయించారు. వచ్చిన నివేదికలో మందులు ఎక్కువ డోస్ తీసుకోవడం వల్లే రిషబ్ మరణించాడని తేలింది.